పయనించేసూర్యుడు,ఫిబ్రవరి 01,కాప్రా ప్రతినిధి సింగం రాజు: మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్పీ కాలనీ నాలుగో డివిజన్ మంగాపురం కాలనీలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి 50వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఉత్సాహపరితంగా జరుగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా శనివారం ఉదయం తీర్థ గోష్టి భక్తులకు ప్రజలకు ఇవ్వడం జరిగింది అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గర్భగుడిపైన సుదర్శన చక్రాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో భక్తులను ప్రజలను ఉద్దేశించి ఉపదేశం ఇవ్వడం జరిగింది వైకుంఠము నుండి భూలోకానికి దిగివచ్చిన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి జీవిలో ప్రకృతిలో ఇమిడికృతమై భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఈ ప్రకృతి ఈ మానవ సమాజం మనుగడ కొనసాగుతుందన్నారు 50 సంవత్సరాల క్రితం మంగాపురం కాలనీలో ఉన్న ఈ గుడిలో ప్రతిష్ట చేయబడిన ప్రసన్న శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడి ప్రజలకు ఆయురారోగ్యాలు వ్యాపారాలలో అభివృద్ధి అన్ని తానై నడిపిస్తున్నాడు కాబట్టే ప్రజల కళ్ళలో ఆనందాలు కనబడుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి 50వ వార్షిక కుంభాభిషేక బ్రహ్మోత్సవాలకు నన్ను ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు ప్రజలకు తనను నమ్ముకున్న వారికి ఆపదలో ఉన్న వారికి వారు కోరుకున్న కోరికలు నెరవేర్చే ఆపద్బాంధవుడు ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు భక్తులకు ప్రజలకు ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుందాం.ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి అద్భుతంగా ఏర్పాట్లు చేసిన ఆలయం ఈవో ఏబి రవీందర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.బ్రహ్మోత్సవాల నిర్వహణ అర్చక బృందాన్ని అభినందించారు మధ్యాహ్నం కుంకుమార్చన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ ప్రభుదాస్ భక్తుల ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.