పయనించే సూర్యుడు మార్చి 8 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.నియోజకవర్గంలోని మహిళా కార్పొరేటర్ల మరియు మహిళ నాయకులు తొ కలిసి కేక్ కట్ చేసి శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలని అదేవిధంగా మహిళలకు రావలసిన హక్కులను కాపాడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల హామీలలో మహిళలకు స్కూటీలను తులం బంగారంతో పాటుగా రెండువేల ఐదువందల రూపాయల పెన్షన్లు ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారి హక్కులను కాపాడాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు నేడు అన్ని రంగాల్లో కూడా మహిళలు రాణిస్తూ ముందుకు వెళుతున్నారని ఈ సందర్భంగా వారు అనుకున్న లక్ష్యాన్ని చేరాలని కోరారు