జనం న్యూస్ జనవరి 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ లో ఫిబ్రవరి ఎడవ తారీకు నాడు ఉదయం ఎడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగునని పాపి రెడ్డి నగర్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న చిట్టి రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఒకసారి ప్రధాన కార్యదర్శిగా మంచి మెజారిటీతో గెలిపించారని,గత ఎన్నికల్లో అధ్యక్షునిగా గెలుపు దిశగా వెళ్లి స్వల్ప మెజారిటీతో గెలవలేదని,ఈసారి జరగబోయే ఎన్నికల్లో పాపిరెడ్డి నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మీ అందరి ఇంటి యజమానుల ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకున్నారు.తను పదవిలో ఉన్న లేకున్నా ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటూ పాపిరెడ్డి నగర్ అభివృద్ధికి ఎమ్మెల్యే మరియు కార్పొరేటర్ సహాయ సహకారలతో బస్తీ అభివృద్ధితో పాటు పలు ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేసేందుకు తన వంతు కృషి చేశానని ఇంకా మునుముందు మీ ఇంటి యజమానుల ఆశీస్సులతో ఇంకా సేవ చేసేలా నన్ను ఆశీర్వదిస్తారని మంచి భారీ మెజారిటీతో గెలిపించాలని పాపిరెడ్డి నగర్ యజమానులను కోరుకుంటున్నాను అని శ్రీధర్ రెడ్డి అన్నారు.ఏడో తారీఖు నాడు శ్రీ నల్ల పోచమ్మ ఆలయం తొమ్మిదవ రోడ్ లో జరగబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ ఒకటి టైగర్ పులి గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో విజయం ఇవ్వాలని శ్రీధర్ రెడ్డి కోరారు.