పయనించే సూర్యడు ఫిబ్రవరి 12, జగ్గయ్యపేట ప్రతినిధి భూక్యా కవిత: ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కృష్ణ - గుంటూరు జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొని గ్రాడ్యుయేట్ ఓటర్లకు కరపత్రాలు అందజేసి ఓట్లు అభ్యర్థించారు.ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ. విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు, టీచర్లు అన్ని వర్గాల వారు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ విజయం అందించారని,అదే వరవడితో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తుంది అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పట్టభద్రులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, వారి సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి పాటుపడతారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, రావూరి విశ్వనాథం, తాళ్లూరి వెంకటేశ్వరరావు, కారుపాటి డేవిడ్, ముత్తినేని అశోక్, డోగుపర్తి నాగభూషణం, పసుమర్తి మహేష్, ఆలూరి రమణ, నాయిని రజిని, వేణు, మార్కపూడి వంశీ, ఆదిమళ్ళ రమేష్ తదితరులు పాల్గొన్నారు.