
పయ నించే సూర్యుడు ఆగస్టు 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్రామచంద్రపురం,(ద్రాక్షారామం)
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటింటి ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ శనివారం ద్రాక్షారామంలోని 76, 78 బూత్ల పరిధిలో కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి, గత రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధి విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి వివరించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అనేక రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ప్రజల గడప వద్దకే ప్రభుత్వం చేరుకుని వారి సమస్యలను తెలుసుకోవడం, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చూడడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మమేకమైన మంత్రి, వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ప్రజలు వ్యక్తం చేసిన సమస్యలు, వినతులను స్వీకరించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు.ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించిన ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమం ద్రాక్షారామంలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.ఈ ప్రచార కార్యక్రమంలో రామచంద్రపురం రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీను, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు పెంకే సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పెంకే అన్నపూర్ణ, ద్రాక్షారామ మాజీ సర్పంచ్ కొత్తపల్లి అరుణ రామారావు, క్లస్టర్ ఇన్చార్జి వాసంశెట్టి శ్రీను, సొసైటీ అధ్యక్షులు ముప్పనపల్లి గణేష్, ఆళ్ల బుజ్జి, మండల బీజేపీ అధ్యక్షులు ఆకేటి కృష్ణ, డాక్టర్ రాంబాబు, యూనిట్, బూత్ ఇన్చార్జులు, సాక్షి వారి వీధి గ్రామ పెద్దలు, కూటమి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.