
పయనించే సూర్యుడు జనవరి 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
కూటమి ప్రభుత్వం దళితులపై దాడులు హత్య రాజకీయాలు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ఆపాలని లేకపోతే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని నంద్యాల వైఎస్ఆర్సిపి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరుపతియ్య జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు కార్ రవికుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇటీవల పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ అనే దళితున్ని హత్యగావించిన సంఘటనపై నేడు నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం అంబేద్కర్ విగ్రహం పట్టణంలోని బొమ్మల సత్రం సర్కిల్లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సీ సెల్, క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం దళితులపై చేస్తున్న దాడులు హత్యలు దారుణాలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరుపతయ్య, జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దళితులపై దాడులను కొనసాగిస్తున్నారని ఇప్పటికి ముగ్గురిని హత్య గావించడం దారుణమైన చర్యలని, ఈ రాజకీయ హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటీవల పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వ కార్యకర్తలు మందా సాల్మన్ అనే దళితున్ని హత్య గావించడం హేయమైన చర్యలని పేర్కొన్నారు. దళితుల పక్షాన తానున్నానని చెబుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దళితులపై జరుగుతున్న దాడులు పై ఎందుకు నోరు విప్పడం లేదని సూటిగా ప్రశ్నించారు. దళితులపై దాడులు చేస్తే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని అమలు చేయడం పేర్కొన్నారు. దళితులపై దాడులను ఆపాలని దళితులకు రక్షణ కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్ , వైసీపీ జిల్లా సెక్రెటరీ దేవనగర్ బాషా,కౌన్సిలర్ చంద్రశేఖర్, జిల్లా వైసీపీ బీసీ సెల్ రామ లక్ష్మయ్య, వైసిపి నాయకుడు సాయిరాం రెడ్డి, మాజీ కౌన్సిలర్స్ మునయ్య, కన్నమ్మ, చాణిక్య రాజ్ ఎమ్మార్పీఎస్ రవికుమార్,pge కిరణ్, చల్ల సత్యం, చెన్న కేశవ,అరేల్, ఎర్రన్న, తిమ్మరాజు, దేవా, భాషీర్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
