
పయనించే సూర్యుడు మార్చ్ 21 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శనివారం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు * "ప్రజా దర్బార్" నిర్వహించారు. ఉదయం నుండి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఈ ప్రజా దర్బార్లో ప్రజల నుండి మొత్తం 73 వినతులను ఎమ్మెల్యే స్వీకరించారు.అందిన వినతుల్లో ప్రధానంగా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, డ్రైనేజీ సమస్యలు మరియు ఇతర మౌలిక వసతులపై ప్రజలు మొరపెట్టుకున్నారు. కొన్ని సమస్యలపై ఎమ్మెల్యే తక్షణమే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, నాయకులు మట్టా మహాలక్ష్మి ప్రభాకర్, పెచ్చేట్టి విజయలక్ష్మి, కాంకటాల రాంబాబు కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.