ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను.
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జ్ సెప్టెంబర్ 22 సోమవారం నాడు
ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను కూనవరం మేజర్ పంచాయతీకి సంబంధించిన నిధులు దుర్వినియోగం, అవినీతికి సంబంధించిన ఆరోపణపై స్పందిస్తూ పత్రికా మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు తన స్పందనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూనవరం మండలం, కూనవరం మేజర్ పంచాయతీకి సంబంధించి నిధులు దుర్వినియోగం, అవినీతి జరుగుతున్న విషయాన్ని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఇటీవల కూనవరంలో సమావేశం నిర్వహించి పలు అక్రమాలపై పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగిందని, దానిపై కూనవరం సర్పంచ్ తన నిజాయితీని నిరూపించుకోకపోగా, పొంతనలేని సమాధానం తోటి పత్రిక ప్రకటన ఇచ్చారని, ఆదివాసి సంక్షేమ పరిషత్ జనసేనను గాని ఏ ఇతర రాజకీయ పార్టీని గానీ కూనవరం పంచాయతీకి సంబంధించిన నిధులు దుర్వినియోగంపై దూషించలేదని కానీ పార్టీకి సంబంధంలేని పంచాయతీ నిధులు దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ పేరు చెబుతూ మేము పవన్ కళ్యాణ్ వారసులమని మేము తప్పు చేయమని మల్లంపల్లి హేమంత్ ఇచ్చిన ప్రకటనపై ఆయన మండిపడుతూ దమ్ముంటే విచారణలో ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలని అంతేకానీ పొంతన లేని ప్రకటనలు చేస్తూ పబ్బం గడుపుకోవటం కాదని ఆయన అన్నారు. శానిటైజేషన్, డ్రైనేజ్, పైప్ లైన్, జల్ జీవన్ మిషన్ కి సంబంధించిన అనేక పనులు చేయకుండానే బినామీల పేరుతోటి బిల్స్ డ్రా చేసిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. అలాగే రేవు పాటకు సంబంధించిన ప్రభుత్వానికి అందలిసినటువంటి సొమ్ము పంచాయతీ ఎకౌంటు ద్వారా ప్రభుత్వానికి అందకపోవటం నిజం కాదని ఆయన ప్రశ్నించారు. వరదల సమయంలో వచ్చిన నిధులు దుర్వినియోగానికి పాల్పడలేదా ? అని ఆయన ప్రశ్నించారు. నేనేం తప్పు చేయలేదు అని చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదని!, తన జనసేన పార్టీ కార్యకర్తలను పిలిచి మీటింగ్లు పెట్టినంతమాత్రాన ఇక్కడ ఎవరు భయపడేవారు లేరని ఆయన తెలియజేశారు. అసలు పార్టీలకు సంబంధంలేని సర్పంచి పదవికి పార్టీ రాజకీయాలు ఎందుకు రుద్దుతున్నారు. ఇది మీ తప్పులను కప్పిపుచ్చుకోవటం కోసం కాదా? అని ఆయన ప్రశ్నించారు. అలాగే పంచాయతీ డెవలప్మెంట్ అధికారులు ఈనెల 24వ తారీఖున విచారణ చేయబోతున్నట్లు తమకు తెలియవచ్చిందని అందుకు ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు కూనవరం పంచాయతీ ప్రజల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నామని, అయితే సంబంధిత అధికారులు సుమోటోగా స్వీకరిస్తున్నామని చెప్పటం కాస్త ఆశస్పదంగా ఉందని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఐటిడిపిఓ వారికి ఇదివరకే ఫిర్యాదు చేసి ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు. అంటే ఈ విషయం పట్ల జిల్లా కలెక్టర్ ఐటిడీపీఓలు కూడా స్పందించి సంబంధిత శాఖకు విచారణకు ఆదేశించలేదని ఇక్కడ అర్థమవుతుందని ఆయన విమర్శించారు. కూనవరం పంచాయితీ నిధులు దుర్వినియోగం, అవినీతిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారికి, ప్రిన్సిపల్ సెక్రెటరీ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ వారికి, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వారికి, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ వారికి, అల్లూరి జిల్లా కలెక్టర్ వారికి మరియు జిల్లా డివిజన్ పంచాయతీరాజ్ శాఖ అధికారులకు అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలియజేశారు. 24 వ తారీఖున జరిగే విచారణ పారదర్శకంగా పంచాయతీ ప్రజల ముందు జరగాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను డిమాండ్ చేశారు.