పయనించే సూర్యుడు అక్టోబర్ 23 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి:గురువారంమండలంలోని వెంకటయ్య తండా గ్రామం లో వ్యవసాయ క్షేత్రం సందర్శన జరిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి భరత్ సేద్య విభాగం శాస్త్రవేత్త మరియు ప్రోగ్రాము కోఆర్డినేటర్, డాక్టర్ ఎం శరత్, విస్తరణ శాస్త్రవేత్త, బి శివ, ఉద్యాన శాస్త్రవేత్త మరియు ఇల్లందు డివిజనల్ ఏడి లాల్ చంద్, టేకులపల్లి ఏవో అన్నపూర్ణ, ఏఈఓ విశాలచౌహన్ మరియు 15 మంది రైతులు పాల్గొనడం జరిగినది. డాక్టర్ టి భరత్ రైతులకు ప్రస్తుతం పంటల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిస్కారం మార్గాల గురించి వివరిస్తూ పత్తిలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు 1 మిలీ. ప్రోఫినోపాస్ లేదా 1.5 గ్రాముల దియోడికార్చ్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే, ఎకరానికి 5 - 6 లింగాకర్షణ బుట్టలు అమరిస్తే పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. అలాగే, పత్తిలో కాయకుళ్లు లక్షణాలు గమనిస్తే వర్షాలు తగ్గాక 0.2 గ్రాముల ప్లాంటమైసిన్ + 8 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కందిలో చివర్లు త్రుంచుకోవటం చేసుకుంటే కనుక మొక్క క్రింది నుంచి ఎక్కువ సంఖ్యలో కొమ్మలు రావటం దీని ద్వారా ఎక్కువ కాత పూత వచ్చి దిగుబడి పెరగటానికి ఆస్కారం ఉంటుంది అని తెలిపారు. బి శివ, ఉద్యాన శాస్త్రవేత్త మాట్లాడుతూ కాకరలో పండు ఈగ నివారణకు పరిస్కారం మార్గాల గురించి వివరిస్తూ పండు ఈగ పూత దశలో గుద్దు పెడుతుంది. ఇది పూత, పిందెలోకి చేరి కాయలు తిని నష్ట పరుస్తుంది. కాయలు వంకర తిరిగి చిన్నవిగా అవుతాయి. పూత, పిందె దశలో మలాథియాన్ 600 మి.లీ ఎకరాకు పిచికారి చేసుకోవాలి. 10 మిలీ మలాథియాన్ + 100 గ్రా చక్కెర లీటరు నీటికి కలివీన (ద్రావణాన్ని ప్లాస్టిక్ పళ్ళాలలోపోసి పొలంలో అక్కడక్కడా పెట్టాలి. ఇది విషపు ఎరగా పనిచేసి పురుగులు ఆకర్షించబడి చనిపోతాయి. మిరపలో వేరుకుళ్లు నివారణకు ఈ తెగుళ్ళు ఆశించినపుడు మొక్కలు వడలిపోయి, ఎండీపోయి, పూత, పిందె, అకులు రాలిపోతాయి. నివారణ 3 లీటరు నీటికి గ్రా కాపర్ అక్సిక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని మొళకృల మొదళ్ళ దగ్గరపోయాలి. సమగ్ర నివారణ చర్యలో భాగంగా 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేప పిండీ, 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి కలిపి వృద్ది చేసుకొని మిరప సాళ్ళలో వేసుకోవాలి. వైరస్ తెగుళ్ల నివారణకు గట్ల మీద, తోటలలో కలుపు మొక్కలు లేకుండా శు్య్రం చేసుకోవాలి. వైరస్‌కు మందు లేదు కనుక వాటి వ్యాప్తికి దోహదపడే రసం పీల్చు పురుగులను నిర్మూలించి వైరస్‌ను సమర్ధవంతంగా తగ్గించుకోవచ్చు. పోలంలో అక్కడక్కడ అయిల్ లేదా గ్రిజ్ పూసిన పసుపు రంగు అట్టలను ఉంచితే తెల్లదోమ ఉధృతిని తెలుసుకోవడంతో పాటు కొంతవరకు తగ్గించుకోవచ్చు పేనుబంక నివారణకు ఎనిపేట్ 300 గా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. తెల్లదోమ నివారణకు ఎకరానికి 500 మీ.లి చేపనూనె మరియు ట్రైజోపాస్ 250 మీ.లీ లేదా ఆస్ట్రమిప్రిడ్ లేదా థయోమిధాక్సం మందులను మార్చి మార్చి 7-10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. తామర పురుగుల నివారణకు ఎకరానికి ఫిప్రోనిల్ 400 మీ.లీ లేదా స్పైనోసాడ్ 50 మి.లీ. లేదా డైఫెన్త్యురాన్ 300 గా లేదా క్లోరోఫిన్ఫైర్ 400 మీ.లీ 200 లీటర్త నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి అని తెలిపారు.