పయనించే సూర్యుడు, జనవరి 26 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం ,కృష్ణ సాగర్ పంచాయతీ కార్యాలయం నందు 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన పంచాయతి సెక్రటరీ నాగిరెడ్డి,జాతీయ మాల మహానాడు జిల్లా ఉద్యోగ సంఘ అధ్యక్షులు పుట్టి శ్రీనివాసరావు,పినపాక నియోజకవర్గం అధ్యక్షులు పిల్లి రవి వర్మ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటితో 76 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం ద్వారా సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఓటు హక్కుగా పొందడం జరిగిందని పేర్కొన్నారు ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ జెండా,ఈ దేశం నావే అనే స్ఫూర్తితో మెలగాలని తెలియజేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు
కార్యక్రమంలో, పంచాయతి సిబ్బందులు, స్కూల్ టీచర్స్, అంగన్వాడీ టీచర్స్ గుండమ్మల పుల్లమ్మ, నాగ రత్నం, హైమ వతి, ఆశ వర్కర్ సుగుణ, తాటి సుధాకర్, సల్వా జస్వంత్, సొందే గోవింద్ మాజీ ఉపసర్పంచ్, బాదావ సురేష్, పాయం వీరభద్రం, పోడియం సాంబశివరావు, యూత్ పిల్లగాళ్ళు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు