
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 (సూళ్లూరుపేట నియోజకవర్గo రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం ఇలుపూరు గ్రామానికి చెందిన చింతగింజ సుందరయ్య రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది.ఈయన గురించి బ్యాంక్ లో విచారించగా ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన (పిఎంజెజెబివై) పథకం యాక్టివ్ లో ఉంది. దీనికిగాను ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్స్ అయిన మేము బ్యాంకు లో క్లెయిమ్ చేశాము. పిఎంజెజెబివై ద్వారా రూ.2 లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. పిఎంజెజెబివై ద్వారా రూ.2 లక్షల రూపాయలు ఈయన భార్య మాధురి కి అందజేయడం జరిగింది. మన్నారుపోలూరు కెనరా బ్యాంక్ మేనేజర్ ఉమా మహేశ్వరి, అసిస్టెంట్ మేనేజర్ నాగ రాజేశ్వరయ్య, ఆఫీసర్ కె.రమేష్ మరియు తిరుపతి డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ సతీష్, సూళ్లూరుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ ముని చంద్ర, పరమానందం పాల్గొనడం జగిరింది