పయనించే సూర్యుడు ఆగస్టు 31 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో తడ మండలం లోని రామాపురం గ్రామంలో జన సురక్ష క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు పీఎం జే డి వై అకౌంట్ కలిగి ఉండాలి అలాగే అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరు బ్యాంకుల్లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ PMJJBY,PMSBY మరియు APY పథకాల గురించి కూడా అందరూ తెలుసుకొని వినియోగించుకోగలరని తెలియజేశారు. ఈ మీటింగ్ లో తిరుపతి జిల్లా ఎల్ డి ఎం శ్రీ రవికుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అకౌంట్ చేసుకొని అకౌంట్ చేసుకున్న వారందరూ కూడా పీఎం జేజేబి వై, పి ఎం ఎస్ బి వై మరియు 10 సంవత్సరాలకు ఒకసారి రికేవైసీ వాటిని చేసుకొని వారి యొక్క అకౌంట్లోనే జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలియజేసినారు మరియు కెనరా బ్యాంక్ హెడ్ ఆఫీస్ బెంగళూరు జనరల్ మేనేజర్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంకులో ఉన్నటువంటి సేవలను తెలుసుకొని వాటి యొక్క ప్రాముఖ్యతను అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేశారు అదే విధంగా తిరుపతి రీజినల్ ఆఫీస్ డెప్యూటీ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్లకు ఎలాంటి మోసపూరితమైన మోసాలకు మరియు సైబర్ నేరాలకు గురించి అవగాహన తెలియజేశారు మరియు డీజీఎం, డిఎం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా సైబర్ నేరాలు పట్ల అప్రమత్తమై ఉండి వారి యొక్క ఖాతాల నుండి ఎలాంటి మోసాలు జరగకుండా చూసుకోవాలని ఎవరికీ ఓటీపీ వివరాలు తెలియజేయకుండా ఉండాలని తెలిపినారు. అలాగే తడ కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అకౌంటులకు రీకేవైసీ చేసుకోవాలి అదేవిధంగా ఇన్సూరెన్స్‌లను మరియు పెన్షన్ పథకాలు కూడా చేసుకొని వారి యొక్క ముందస్తు జాగ్రత్తల కోసం తగిన విధంగా మీరు బ్యాంకుల్ని ఉపయోగించుకోగలరని తెలియజేసినారు. ఈ మీటింగ్ లో ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా ఎల్డిఎం రవికుమార్ కెనరా బ్యాంక్ బెంగళూరు హెడ్ ఆఫీస్ జనరల్ మేనేజర్ పి చక్రవర్తి తిరుపతి సర్కిల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ శ్రీ పాండురంగ మితంతయ తిరుపతి కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్ డీజిఎం శ్రీ రామ మోహన్ మరియు తిరుపతి రీజినల్ ఆఫీస్ డిఎం తడ కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్, శ్రీ సిటీ కెనరా బ్యాంక్ మేనేజర్ మరియు కెనరా బ్యాంక్ స్టాఫ్ ఎస్ ఎస్ టి ఆర్గనైజేషన్ సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ , రామాపురం క్లస్టర్ ఈ ఓ ఏ లు ఈ యొక్క మీటింగ్ కు హాజరవడం జరిగింది.