
పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం కెపిహెచ్బి 6వ ఫేజ్‌లోని అబ్దుల్ కలాం పార్క్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.బీజేపీ సీనియర్ నాయకులు ఎన్. రత్నకుమారి , ఎన్. గురుప్రసాద్ (రత్న జ్యువెలరీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై యోగాభ్యాసం చేశారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ…“యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపద. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తమ జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలి” అని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని, నేడు అనేక దేశాల్లో ప్రజలు యోగాను ఆచరిస్తూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు.యువతతో పాటు ప్రతి వయస్సు వారు యోగాను అలవర్చుకోవాలని, ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని వడ్డేపల్లి రాజేశ్వరరావు పేర్కొన్నారు.అనంతరం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన గురుప్రసాద్ రత్నకుమారి మరియు కోటేశ్వరరావు వారి మిత్ర బృందాన్ని వడ్డేపల్లి రాజేశ్వరరావు అభినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.