▪మన ఇంటి మందం..మన పంట
పయనించే సూర్యడు //జనవరి 22//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్..
గ్రామ నవ నిర్మాణ సమితి "(జి ఎన్ ఎన్ యస్ కేవీకే )" ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టులో భాగంగా "మన ఇంటి మందం మన పంట"(ప్రకృతి వ్యవసాయం) అనే సంకల్పంతో రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి లో లభించే సహజ వనరులతో వ్యవసాయం చేయాలనీదే ముఖ్య ఉద్దేశం అని ప్రకృతి వ్యవసాయ జమ్మికుంట క్లస్టర్ కోఆర్డినేటర్ దేవునూరి రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన ఆరోగ్యాలను మనమే కాపాడుకోవాలని, మన ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలని దీని ముఖ్య ఉద్దేశమన్నారు.ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ప్రకృతి లో కాలుష్యం నివారించవచ్చు,ఇందులో భాగంగా జమ్మికుంట మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో రామడుగు లక్ష్మి సంపత్ రావు ,ఇంటి వద్దా వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో రామడుగు లక్ష్మి సంపత్ రావు అనే రైతులు ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయంలో భాగమైనారు.అని తెలిపారు.దీనిలో భాగంగా 1 ఎకరం వ్యవసాయ భూమిలో జీవామృతం (ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, పప్పుల పిండి ,రసాయనాలు
కల పని మట్టి లేదా పుట్ట మట్టి ) తయారు చేసి వాళ్ళ 1 ఎకరం భూమికి పారించడం జరిగింది, అన్నారు.దీనివల్ల భూమిలో ఉన్న మేలుచేసే సూక్మజీవుల సంఖ్య పెరిగి భూసారం పెరుగుతుంది.అని తెలిపారు.తద్వారా ఆరోగ్య కరమైన మరియు నాణ్యమైన పంట వస్తుందని, వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జమ్మికుంట క్లస్టర్ కో ఆర్డినేటర్ దేవునూరి రవీందర్ ,ఫీల్డ్ ఫెసిలెటర్ గిరవేన అభిషేక్ యాదవ్ మరియు తదితర రైతులు పాల్గొన్నారు