
పయ నించే సూర్యుడు జనవరి 26 ముమ్మిడివరం
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.సూర్య కుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు పెద్దలు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ దేశాభివృద్ధికి తోడ్పడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. పాఠశాల విద్యార్థులు జాతీయ గీతం ఆలపించి, దేశభక్తి గీతాలు పాడుతూ వేడుకలకు శోభ చేకూర్చారు. ఈ సందర్భంగా విద్యార్దులు చేసిన పెరేడ్, పిరమిడ్స్ విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.అనంతరం ఓటర్స్ డే రోజున ఏర్పాటు చేసిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్, కమిటీ మెంబర్ లు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
