ప్రజల సొమ్ముని బడా బాబులకు దోసి పెడుతున్న మోడీ ప్రభుత్వం
పయనించే సూర్యుడు,
ఫిబ్రవరి 03,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు
నిరసన బడ్జెట్ కాగితాలు అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తగలబెట్టాం జరిగినది, ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్
బడా బాబులకు ,,కాంట్రాక్టర్లకు అదాని, అంబానీ వారికి అనుకూలమైన బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల
తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వకపోవడం చాలా దారుణం అని అన్నారు , తెలంగాణలో 8 మంది బిజెపి ఎంపీలు ఇద్దరు మంత్రులుగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాని దౌర్భాగ్యం ఇంతకంటే ఇంకేమన్నా ఉందా అన్నారు, ప్రజల్లారా ,బిజెపి పాలన ప్రజలకు ప్రమాదంగా మారుతుంది ,జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనికి సంబంధించి సుమారుగా రెండు లక్షల 60 వేల కోట్లు బడ్జెట్లో పెట్టాల్సిన అవసరం ఉంది , కానీ కేవలం 86 వేల
కోట్లు తో సరిపెట్టింది, పాత అప్పు 25 వేల కోట్లు పోతే మిగిలింది 61,000 కోట్లే తో ఉపాధి హామీ పథకం 2025లో ఎట్లా సాధ్యపడిద్దని అన్నారు.అంతేకాదు విద్య, వైద్యం ,సామాన్య ప్రజలు నిత్యవసర సరుకులు కొనుక్కొని తినే పరిస్థితి లేకుండా పోయింది, ఈ దేశంలోనే ఆర్ఎస్ఎస్ ఏ రకంగా నడిపిస్తుందో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది ,బడ్జెట్ ని తీవ్రంగా సిపిఎం పార్టీ ఈ బడ్జెట్ ని తీవ్రంగా ఖండిస్తుంది, మొత్తం బడ్జెట్లో ప్రవేశపెట్టిన50 లక్షల 65 వేల 345 కోట్లు ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి పైసా ఇవ్వకుండా ఉండటం చాలా దారుణం అది బిజెపి ఎంపీలు, కేంద్ర మంత్రులపై ,ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు కూడా,రాబోతున్నాయని అన్నారు . ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు భయ్యా రాము, పాండవుల రామనాథం ఎస్.కె అబిదా, గుంటుక కృష్ణ, కమటం మరియమ్మ ,తదితరులు పాల్గొన్నారు