పయనించే సూర్యుడు న్యూస్ తాడిపత్రి రిపోర్టర్ కుళ్లాయప్ప 12 ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఆయన ఛాంబర్ లో కలిసి సత్యసాయిజిల్లాలో ఉన్న శిల్ప చిత్రకళ లేపాక్షి మరియు రాయలవారు ఏలిన రెండవ రాజధాని పెనుగొండ, కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి, పట్టుచీరలకు నిలయం ధర్మవరం, విదేశీ పక్షుల విడిది వీరాపురం నిమ్మలకుంట తోలుబొమ్మలు, కటారుపల్లి యోగివేమన సమాధి, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు తిమ్మమ్మ మర్రిమాను వంటి పర్యాటక ప్రదేశాల గురించి వివరించి పర్యాటక రంగానికి కావాల్సిన నిధులను కేటాయించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రికి ప్రతిపాదనలను అందజేసి పర్యాటకరంగానికి కావలసిన నిధులను కేటాయించాలనికోరిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికె పార్థసారధి కేంద్ర మంత్రివర్యులు కూడా సానుకూలంగా స్పందించారని తెలియ జేశారు…