సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యం. డి అబ్బాస్
పయనిచ్చే సూర్యుడు జనవరి 17 (జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న )కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని రద్దుచేసి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలన్న లక్ష్యంతో మతాల పేరుతో హిందుత్వ ఎజెండాతో పరిపాలన చేయాలని చూస్తుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎమ్ డి .అబ్బాస్ దుయ్య బట్టారు. తెలంగాణ రాష్ట్రంలో జనవరి 25 నుండి 28 తేదీలలో సంగారెడ్డి పట్టణంలో జరుగు సిపిఎం రాష్ట్ర మహాసభల ను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు , శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గం లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ స్మారక భవనంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యిర్రి అహల్య అధ్యక్షత వహించగా వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో మోడీ సర్కార్ నూతన ఆర్థిక విధానాలను నయా ఉదార వాద విధానాలను చాలా వేగవంతం అమలు చేస్తుందన్నారు. కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతూ అంబానీ, ఆదానిలకు మోడీ సర్కార్ మారిందనరు. ప్రజలపై భారాలు మోపుతూ పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ రోజువారిగా వాడుకునే సరుకుల ధరలు విపరీతంగా పెంచి ప్రజలు బతకలేని దుర్భర స్థితిలోకి నెట్టివేస్తుంది అన్నారు. వికసిత్ భారత్ అంటూ అందమైన పదాలు చెబుతూ ప్రజలను సమస్యలను ఊబిలోకి ముంచేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పోరేట్లకు దోచి పెడుతూ అవినీతి ఆశ్రిత పక్షపాతంతో దేశాన్ని పాలకులు కబలిస్తున్న అన్నారు. తెలంగాణలో ప్రజల మధ్య మతపరమైన విభేదాలు పెంచేందుకు బిజెపి, ఆర్ఎస్ఎస్. లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు . ప్రజలు ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఉపాధి సమస్యలతో సతమవుతమవుతుంటే ప్రజల అసంతృప్తి తమకు వ్యతిరేకంగా మారకుండా మతోన్మాదాన్ని, కూలోన్మాదాన్ని రెచ్చగొడుతుంది అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తుందని, అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి, రెండు అమలు చేసి మిగితా సమస్యల గురించి మీనమేషాలు లెక్కిస్తూ రైతులు కార్మికులు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో తాత్సారం చేస్తుందన్నారు. ఆర్థిక విధానాల్లో మాత్రం బిజెపి కాంగ్రెస్ పార్టీలకు తేడా కనబడటం లేదని నిరసన వ్యక్తం చేశారు .విద్యార్థి, యువజన, మహిళ, వృత్తిదారులు, వ్యవసాయ కూలీలు, రైతులు, అసంఘటిత రంగ కార్మికుల, మధ్యతరగతి ఉద్యోగుల, మైనార్టీలు అన్ని రంగాల ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజా ఉద్యమాలకు సారథ్యం వహించి నిఖార్సు అయిన సంఘము గా పోరాడుతున్న పార్టీ సిపిఎం అని తెలిపారు. ఈనెల 25 నుండి 28 తేదీలలో సంగారెడ్డి పట్టణంలో సిపిఎం నాల్గవ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని ఈ మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న వ్యతిరేక విధానాలపై పలు తీర్మానాలు చేసి భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, సింగారపు రమేష్, రాపర్తి సోమయ్య, సాంబరాజు యాదగిరి, బోట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, జోగు ప్రకాష్, మునిగేల రమేష్, బీ. చందు నాయక్, చిట్యాల సోమన్న, సుంచు విజేందర్, బోడ నరేందర్, ఉపేందర్, బెల్లంకొండ వెంకటేష్, కొడపాక యాకయ్య, ఎండి. షబానా, బిట్ల గణేష్, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య, మండల నాయకులు సోమసత్యం, మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మదర్ తదితరులు పాల్గొన్నారు.