పయనించే సూర్యుడు ఫిబ్రవరి 3 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్
మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో సాహు మాట్లాడుతూ, తెలంగాణ పైన కేంద్రం విద్వేషం చూపుతుంది బీజేపీ ఎంపీలలో తెలంగాణ ఎంపీలలో డిఎన్ఏ ఉంటే ఇప్పటికైనా గొంతు ఎత్తాలి అని అన్నారు,కేంద్రాన్ని పదేళ్లు నిధులు అడగడం లేదని ఇన్నాళ్లు చెప్పుకొచ్చారు.రాష్ట్రాలు అన్ని కలిస్తేనే యూనియన్ బడ్జెట్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర క్యాబినెట్ మినిస్టర్లు అయి ఉండి తెలంగాణకు బడ్జెట్ గాడిద గుడ్డు తెచ్చిన వీరిని అభివృద్ధి నిరోధకులుగా బిజెపి విధానాలను వ్యతిరేకిస్తూ బడ్జెట్ కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నం.పీఎం మోడీ తెలంగాణ అభివృద్ధి సంక్షేమం శూన్యం కిషన్ రెడ్డి బండి సంజయ్ లను జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో తెలంగాణ యువత నిరసనలు తెలుపాలని కోరుకుంటున్నాం తెలంగాణపై ప్రేమ ఉంటే వారిద్దరూ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.దేశ సమగ్ర అభివృద్ధి దిశగా కాకుండా రాజకీయ ప్రయోజనాలకు బడ్జెట్లో పెద్దపీట వేశారని పేర్కొన్నారు.ఢిల్లీ,బీహార్ ఎన్నికల కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్రం చూపిస్తున్న వివక్షకు బడ్జెట్ కేటాయింపులే నిదర్శనమని అన్నారు.కొన్ని రాష్ట్రాలకే బడ్జెట్ కేటాయింపులు అందిస్తే వికసిత్ భారత్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో రూ.లక్ష కోట్లు వసూలు చేస్తున్నకేంద్రం.కనీసంరూ.40వేల కోట్లు కూడా తిరిగి ఇవ్వకపోవడం బాధాకర మన్నారు.సీఎం రేవంత్ రెడ్డి డిల్లీ పర్యటనలపై విమర్శలు గుప్పించే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు బిజెపి ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో కొట్లాడి తెలంగాణకు నిధులు తేవాలని డిమాండ్ చేశారు