కేంద్ర బడ్జెట్ కు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం పయనించే సూర్యుడు ఫిబ్రవరి 3 పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి. పాల్వా టౌన్: కేంద్రం లో నీ బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో శనివారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కి నిరసనగా సోమవారం నాడు భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగినది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పొదిల తులసి రామ్ మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు కూలీలకు కార్మికులకు నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీకి నిధుల కేటాయించలేదని బయ్యారం ఉక్కు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సిటీ కొత్తగూడెం విమానాశ్రయం, భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైను బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావించకుండా తెలంగాణ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం మొండి చెయ్యి చూపిందన్నారు.విద్య వైద్యం ఉపాధి రంగాలను రంగాలకు నిధులు పెంచక పోవటం సరికాదని మధ్యతరగతి పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఈ బడ్జెట్ లో లేవని ఈ ప్రజావ్యతిరేక బడ్జెట్ నుప్రతి ఒక్కరు వ్యతి రేకించాలన్నారు. వ్యతిరేకించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి నిరంజన్ కాంతి బి మాధవి, ఎస్.కె రహీం, బి నారాయణ సోమలింగం మేస్త్రి గట్టయ్య తదితరులు పాల్గొన్నారు