పయనించే సూర్యుడు// న్యూస్ మే 21//మక్తల్ రిపోర్టర్ సీ తిమ్మప్ప//
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను మానుకోవాలని ముఖ్యంగా కార్మికులకు నష్టం కలిగించే నాలుగు కార్మిక కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మక్తల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళ వారం రోజు నిరసన తెలియజేశారు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోవింద్ రాజ్ మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాలు మరియు సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల ఆధ్వర్యంలో మే 20న సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని అయితే పహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్య వలన దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి వల్ల సమ్మెను జూలై 9 కి వాయిదా వేసుకుని నేడు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. జులై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఉంటుందని తెలిపారు .స్వాతంత్రానికి పూర్వం నుండే పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నూతనంగా యజమానులకు అనుకూలంగా నాలుగు కార్మిక కోడ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నదని ఇవే కనుక అమలు అయితే కార్మికులు కట్టు బానిసత్వం లోకి నెట్టేయబడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనం ,ఉద్యోగ భద్రత సంఘటితపు హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు తదితర కార్మిక హక్కులని కాలరాస్తాయి ఈ కార్మిక కోడ్లని ఆందోళన వ్యక్తం చేశారు.యజమానులకు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తయారు చేసిన ఈ నాలుగు కార్మి కోడ్ లూ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆశ ,మధ్యాహ్నం భోజన కార్మికులు ఆర్పీలు, అంగన్వాడి ,మున్సిపల్ గ్రామపంచాయతీ తదితర రంగాల కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని పీఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత ప్రమాద బీమా పెన్షన్ తదితర చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు .శ్రమకు తగ్గ ఫలితం అందివ్వడంలో పాలకులకు మనసు ఒప్పడం లేదని కార్పొరేట్ కంపెనీలకు మాత్రం లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ప్రకటిస్తున్నారని విమర్శించారు ఆదాని అంబానీ తదితర పారిశ్రామికవేత్తల ఆస్తులు పెరిగిపోతున్నాయని అన్నారు పెట్టుబడుదారుల కోసం కార్మిక వర్గాన్ని బలి చేయొద్దని హితవుపలికారు . దేశానికి అన్నం పెట్టే అన్నదాతను బడా కంపెనీలకు అబ్బ చెప్పే విధానాన్ని మానుకోవాలన్నారు రైతుని రుణ విముక్తిని చేయాలని రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని అప్పుడే రైతులకు మేలు కలుగుతుందని అన్నారు.బడుగు బలహీన వర్గాలకు ఉన్న ఊళ్లో ఉపాధి కల్పిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా కేవలం 86 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఉపాధి కూలీలకు రోజు కూలి 600 రూపాయలకు పెంచి సంవత్సరంలో 200 పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
విమాన యానం రైల్వే బొగ్గు విద్యుత్తు తదితర దేశ సంపదను కారు చౌకగా బడా పారిశ్రామికవేత్తలకు అమ్మే విధానానికి స్వస్తి పలకాలన్నారు.మన దేశ ప్రధాని కార్పోరేట్లే సంపద సృష్టికర్తలని కీర్తించడం దారుణమని విమర్శించారు. సంపద సృష్టికర్తలు శ్రమజీవులు అన్న సంగతి గుర్తు ఎరగాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ నాయకులు సుజాత, వెంకటమ్మ, అనురాధ, గోవిందమ్మ, ఇందిరా, ఆర్ పి నాయకురాలు కవిత, జమున, ఎన్ జ్యోతి, అంగన్వాడి యూనియన్ నాయకురాలు అంబికా, లలిత, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు