
పయనించే సూర్యుడు జనవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ..
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా గెద్దనపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ను భారతీయ జనతా పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు యాళ్ల దొరబాబు, బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, ముమ్మిడివరం మార్కెటింగ్ యాడ్ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి డైరెక్టర్ మట్ట సూరిబాబు బిజెపి జిల్లా నాయకులు సుంకర నాగేశ్వరరావు మద్దింశెట్టి శ్రీనివాసరావు తదితరులు మంత్రి వర్మకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారందరూ కలిసి గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన సంక్రాంతి వేడుకలను పల్లెటూరి వాతావరణంలో జరుపుకోవడం ఆనందబదాయకమని మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. కోనసీమ సంప్రదాయ పద్ధతుల్లో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
