14 నెలల్లోనే ప్రజల నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్
ప్రజలకు నిజమైన అభివృద్ధి కావాలి అంటే ఒక్కటే మార్గం — బీజేపీ!”
బీజేపీ యువ నాయకులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
ఈరోజు వరంగల్లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం, ఆయన భయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న నాయకుడు, ఇప్పుడు మళ్లీ పాత మాటలు చెబుతూ తన వైఫల్యాలను దాచే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ను నెంబర్ వన్ విలన్ అని ప్రచారం చేయాలని చూస్తూ, తన చేసిన నేరాలను మరచిపోయారు.తెలంగాణ ప్రజలకు మరువలేని నిజం - కేసీఆర్ పాలనలోనే లక్షలాది రైతులు అప్పుల ఊబిలో పడి ప్రాణాలు తీసుకున్నారు. యువత ఉద్యోగ అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తూ చివరికి నిరాశతో మిగిలారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేర్లతో వేల కోట్ల రూపాయలు గల్లంతయ్యాయి. పాలన అనేది కుటుంబ పరిమితిలో మాత్రమే మిగిలి, ప్రజలకు తగిన న్యాయం జరగలేదు. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టింది. రాష్ట్ర అభివృద్ధి పేరుతో అప్పుల గుట్టకెక్కించి, పథకాల పేరుతో మోసం చేసి వెళ్లిపోయారు.ఇప్పుడు 14 నెలలుగా కాంగ్రెస్ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తోంది. రైతులకు ఉచిత కరెంట్ హామీలు ఇచ్చినా, సరిగ్గా అమలు చేయలేకపోయారు. పెన్షన్ల విషయంలో వృద్ధులకు ద్రోహం చేశారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా, లబ్దిపొందిందేమీ లేదు. మద్య మాఫియా తిరిగి బలపడింది, రాష్ట్రం శాంతిభద్రతల పరంగా వెనుకడుగు వేసింది. రైతు భరోసా, రుణ మాఫీ వంటి వాగ్దానాలు ఇప్పటికీ నెరవేరలేదు.తెలంగాణ ప్రజలు ఇప్పుడు స్పష్టంగా గమనిస్తున్నారుబీఆర్ఎస్ మోసం చేసింది, కాంగ్రెస్ మోసం కొనసాగిస్తోంది. ఒకదానికి ప్రత్యామ్నాయంగా మరోదాన్ని ప్రజలు ఎన్నుకోవడం కాదు. తెలంగాణ ప్రజలు కొత్త దిశగా, నిజమైన అభివృద్ధి మార్గంలో నడవాలని ఆశిస్తున్నారు. అదే మార్గం బీజేపీ మార్గం.బీజేపీ మాత్రమే తెలంగాణకు పారదర్శకమైన పాలనను, రైతుకు న్యాయాన్ని, యువతకు అవకాశాలను, మహిళలకు భద్రతను, రాష్ట్రానికి నిస్వార్థ అభివృద్ధిని అందించగలదు.తెలంగాణను మళ్లీ మోసపుచేయాలనుకునే కుట్రలకు ప్రజలు బలికిపోరు. రాబోయే రోజుల్లో ప్రజలు తమ బలాన్ని చూపించి, బీజేపీకి పూర్తి మద్దతు ఇచ్చి, తెలంగాణను నిజమైన ప్రగతి మార్గంలో నడిపిస్తారని మేము గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం.