ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
ఎల్లారెడ్డి గూడలో మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి ప్రచారం
పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి
( పయనించే సూర్యుడు అక్టోబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
కేసీఆర్ హైదరాబాద్ నగర అభివృద్ధిలో తెచ్చిన మార్పును ప్రపంచమే గుర్తిచ్చిందని,కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి జూబ్లీహిల్స్ ప్రజలు మాగంటి సునీతమ్మను గెలిపించాలని సోమాజిగూడ డివిజన్లో ఎల్లారెడ్డిగూడలో పోలింగ్ భూత్ లలో మాగంటి సునీతమ్మ గెలుపు కొరకు మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మా రెడ్డి,కార్పొరేటర్స్ మాజీ కార్పొరేటర్లు,హేమ షామల, మహేష్ యాదవ్,శైజాన్ శేఖర్,దేవేందర్ రెడ్డి, ప్రభు దాస్ భూత్ ఇన్చార్జులు కోఆర్డినేటర్లు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.