▪️భారీ ర్యాలీతో సాగిన సర్ధార్ రవీందర్ సింగ్ నామినేషన్...
పయనించే సూర్యుడు// ఫిబ్రవరి 10// హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్// కుమార్ యాదవ్..కరీంనగర్ నిజామాబాద్ మెదక్ అదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ అట్టహాసంగా ర్యాలీ నిర్వహించారు.డప్పుల మోతలతో , సన్నాయి వాయిద్యాలతో , పట్టభద్రులతో కరీంనగర్ జిల్లా మారుమ్రోగింది.కరీంనగర్ జిల్లా టవర్ గంజ్ లోని వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం నుండి ప్రారంభించి వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జనసమీకరణ చేయటంతో ర్యాలీలు, జెండాలు, డిజె మైకుల మోత, ఆటపాటలతో మార్మోగింది.జై తెలంగాణ జైజై తెలంగాణ ... ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదంతో జనసందోహంగా కరీంనగర్ జిల్లా మారుమ్రోగింది.ఈ సంధర్బంగా సర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ..కరీంనగర్ లో అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి నేనేనని అన్నారు. పట్టభద్రులు ఆలోచించండి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఒకే నాణానికి బొమ్మ, బొరుసు లాంటి వాళ్లు, అని కరోనా సమయంలో ఇక్కడి ప్రజల కోసం ఎన్నో సేవలు చేశానన్నారు.మాజీ మేయర్ గా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామనితెలిపారు.కుటుంబంలో పెద్దదిక్కు మృతి చెందితే దహన సంస్కారాలకు ఆర్థిక ఇబ్బందులు గురికావడం చూసి దేశంలోనే ఎక్కడలేని విధంగా కేవలం ఒక్క రూపాయికే అంత్యక్రియల పథకానికి శ్రీకారం చుట్టానని పేర్కొన్నారు .అంతేకాకుండా ఒక్క రూపాయికే నల్ల కనెక్షన్ , సరస్వతి ప్రసాదం ఇంకా మరెన్నో పథకాలు అమలు చేశామని అన్నారు.నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉండే నేతలకు మండలిలో అవకాశం ఇస్తే ప్రశ్నించే గొంతుకనై గళమెత్తి పట్టభద్రుల హక్కుల కోసం పోరాడుతానని భరోసా ఇచ్చారు.పట్టభద్రుల కోసం ఒక్క రూపాయికే 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ భీమా పథకాన్ని స్వయంగా కల్పిస్తానని అన్నారు.ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకు, ప్రజా సమస్యలపై పోరాడే నాయకులకు ఓటే వేయాలని కోరారు.విద్య అమ్ముకునేవాళ్ళు , వ్యాపారం చేసేవారు మనకు వద్దు... ఆలోచించి పట్టభద్రులు ఓటు వేయాలని ..బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని "పట్టభద్రుల మద్దతు తనకే ఉందని ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని సర్ధార్ రవీందర్ సింగ్ తెలిపారు.