పయనించే సూర్యుడు జనవరి 12హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతరకు హుజురాబాద్ నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ వి రవీందర్ నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. తేదీ 13-01-2025 నుండి 16-01-2025 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందన్నారు. పెద్దలకు 50 రూపాలు , పిల్లలకు30 రూపాయలు. హుజురాబాద్ నుండి గోపాల్పూర్ ద్వారా కొత్తకొండకు,హుజురాబాద్ నుండి పెంచికలపేట మీదుగా,హుజురాబాద్ నుండి మాణిక్యపుర్ ద్వారా కొత్తకొండకు స్పెషల్ బస్సులు ఉన్నామని హుజురాబాద్ డిపో మేనేజర్ తెలియజేశారు. కావున ఇట్టి అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ తెలియజేశారు.