
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14 లక్ష్మీదేవి పల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవి పల్లి మండలం , హేమచంద్రపురం నుండి అనిశెట్టిపల్లి ఇల్లెందు రోడ్డు వరకు రెండు కిలోమీటర్ల రోడ్డు మరియు ముర్రేడు వాగు పై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఏడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన సందర్భంగా శుక్రవారం హేమచంద్రపురం లో రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, పిఎసిఎస్ ఉపాధ్యక్షుడు కూచిపూడి జగన్నాథరావు, మాజీ ఎంపీటీసీ కళ్లెం సత్యనారాయణ, మాజీ సర్పంచ్ బండ వెంకటేశ్వర్లు, మాజీ ఉపసర్పంచ్ వజ్జా ఎర్రయ్య, కళ్లెం పూర్ణచంద్రరావు, యల్లావుల ఉపేందర్, బైకానీ కృష్ణారావు, బొల్లా చంద్రారెడ్డి, మామిళ్ళ లింగయ్య యాల్లావుల నగేష్, ముత్యాల మహేష్, యాల్లావుల వెంకటేశ్వర్లు, గోలి శీను తదితరులు పాల్గొన్నారు