
పయ నించే సూర్యుడు ఆగస్టు 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం గ్రామంలోని సుంకర వారి సత్తెమ్మ అమ్మవారికి ఆదివారం ఆషాడ మాస సారెను భక్తులు ఘనంగా సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు చలిమిడి, పిండి వంటలు, వివిధ రకాల మిఠాయిలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీటి సంఘం డైరెక్టర్ సుంకర బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, గాజులు సమర్పించారు. ఆషాడంలో అమ్మవారికి సారె సమర్పించడం వల్ల గ్రామంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని, అమ్మవారు గ్రామస్తులందరినీ కాపాడుతుందని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమం అనంతరం అన్నదానం నిర్వహించి వచ్చిన భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.