

పయనించే సూర్యుడు ఆగస్టు 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గ బీజేపీ కన్వీనర్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం అధ్యక్షతన కొత్తపేట నియోజకవర్గ సంస్థాగత సమావేశం కొత్తపేట ఆర్యవైశ్య కల్యాణమండపంలో జరిగింది. జిల్లా బీజేపీ ఇంచార్జి కారంకి శ్రీనివాస్, జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధ్యక్షులు, బూతు స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. ఫారం ఆరు, ఏడు, ఎనిమిది వివరాలు, వాటి ఉపయోగాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నవారి వివరాలపై బూతు స్థాయి కార్యకర్తలకు అవగాహన కల్పించారు. బీజేపీ పార్టీని కొత్తపేట నియోజకవర్గంలో బలోపేతం చేయడమే లక్ష్యంగా అందరూ ఐకమత్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం కన్వీనర్ పాలూరి సత్యానందం ఆధ్వర్యంలో మందపల్లి, ఏనుగుమహల్, చినగుడపాలెం నుండి పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. జిల్లా ఇంచార్జిగా నియమితులైన యాళ్ల దొరబాబు, కారంకి శ్రీనివాస్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజి, గుంటూరు జిల్లా బీజేపీ ఇంచార్జి యాళ్ల దొరబాబు, తమలంపూడి రామకృష్ణారెడ్డి, అయినవిల్లి సత్తిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ మోకా సుబ్బారావు, జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాస్, పాలూరి జయప్రకాష్ నారాయణ, త్రిమన్ కమిటీ సభ్యులు కోటిపల్లి దామోదర్, గుడపల్లి రాంబాబు, నాగిరెడ్డి స్వామి, మండల బీజేపీ అధ్యక్షులు సంపతి కనకేశ్వరావు, సుంకర శ్రీరాములు, గొలకోటి వెంకటేశ్వరరావు, దొడ్డిపట్ల శ్రీనివాస్, అల్లు భాస్కర్, సుబ్బరాజు, ఇల్ల పల్లంశెట్టి, బల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.