
పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 19 అమలాపురం
గో రక్షకులు ప్రముఖ హిందూ ధార్మిక నాయకులు కోటిపల్లి రఘురాం వేణుగోపాల్ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య స్థాపకుడు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి
దీనికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం పాల్గొన్నారు ముందుగా బోడి పాలెం వంతెన సెంటర్ వద్ద శివాజీ మహారాజ్ ప్లెక్సీ కి పూలమాలలు వేసి అనంతరం ర్యాలీగా బయలుదేరి వాడపాలెం పంచాయతీ సెంటర్ వద్ద ఉన్న శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి జై భవానీ వీర శివాజీ అంటూ కొనియాడారు అనంతరం ఆరెస్సెస్ బౌద్ధ ప్రముఖ్ తొగరు సీతారామాంజనేయులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ (1630-1680) పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప యోధుడని ఆయన ఫిబ్రవరి 19, 1630న శివనేరి కోటలో జన్మించిన శివాజీ, తల్లి జిజాబాయి, తండ్రి షాహాజీ భోంస్లేల మార్గదర్శకత్వంలో చిన్న వయస్సులోనే తోర్నా కోటను గెలిచి, గెరిల్లా యుద్ధతంత్రం (గోరిల్లా వార్ఫేర్) ద్వారా మొఘల్, బీజాపూర్ సుల్తానులను ఎదిరించి స్వరాజ్యాన్ని నెలకొల్పారని అన్నారు.16 ఏళ్ల వయస్సులోనే తోర్నా కోటను స్వాధీనం చేసుకుని, రాజ్‌గఢ్, కొండన, పురందర్ కోటలను గెలుచుకున్నారు.గెరిల్లా యుద్ధతంత్రం: శివాజీ గెరిల్లా యుద్ధ విద్యలో నిష్ణాతులు. ఆదిల్షా, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యాలను మెరుపు దాడులతో విస్తుపోయేలా చేశారని కొనియాడారు.1674 జూన్ 6న రాయఘడ్ కోటలో 'ఛత్రపతి'గా పట్టాభిషేకం చేసుకుని, స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని ప్రకటించారు.శివాజీ సామ్రాజ్యాన్ని ఎనిమిది మంది మంత్రుల మండలి (అష్టప్రధాన్) ద్వారా పాలించారు. మహిళల పట్ల గౌరవం, ఇతర మతాల పట్ల సహనం, సరైన పరిపాలనా వ్యవస్థ ఆయన ప్రత్యేకత.ఏప్రిల్ 3, 1680న అనారోగ్యంతో రాయఘడ్ కోటలో స్వర్గస్తులైనారన్నారు.శివాజీ భారతీయ చరిత్రలో ధైర్యసాహసాలకు, స్వపరిపాలనకు, హిందూ సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచారని హిందువులరికీ ఆదర్శ వంతులని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కోటిపల్లి సుబ్రహ్మణ్యం, కోటిపల్లి దామోదర్, గంగారాం, అంజిబాబు మరియు హిందూ బంధువులు నాయకులు పాల్గొన్నారు
