పయనించే సూర్యుడు జూలై 18 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో భాగంగా ఈ దినము సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద గల శిబిరంలో, ఇంజనీరింగ్ కార్మికులు, మరియు పారిశుద్ధ్య కార్మికులు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం జరిగింది, పై కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె ఆరో రోజుకు పారిశుద్ధ్య కార్మికుల సమ్మె మూడవ రోజుకు చేరిందని, ప్రభుత్వం స్పందించి కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చాలని డిమాండ్ చేశారు. పై కార్యక్రమంలో నాయకులు ఎస్.కె రియాజ్, కె సాంబశివయ్య, సిహెచ్ చంద్రశేఖర్, బి, పద్మనాభయ్య, టౌన్ శాఖా సభ్యులు, ఎస్ కె ,అక్బర్ బాషా, పి, ఖాన్, జడ భాస్కర్, ఎస్, కె ,ఫయాజ్, మరియు మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు వెంకటరత్నం, రామయ్య, కరీం, మురళి, బాబు, తదితరులు పాల్గొన్నారు