రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం
పయనించే సూర్యుడు మే 16 (పొనకంటి ఉపేందర్ రావు)
శుక్రవారం హైదరాబాద్ నుండి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో కలసి వరి ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దాన్యం సేకరణ సాఫీగా చేపట్టాలన్నారు. అకాల వర్షాలు కురుస్తునందున ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని వాహనాలలో లోడింగ్ చేసి ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఇందుకు జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలం అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలాంటి అవంతరాలకు తాగులేకుండా సాఫీగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలో ఇప్పటికే 34 వేల 300 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రైతుల ఖాతాలకు ఎప్పటికప్పుడు డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. దాన్యం ఎంత వచ్చినా ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. రానున్న పది రోజుల్లో జిల్లాలో మిగిలిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రణాళిక లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అందరు మిల్లర్లు తోపాటు ఇతర జిల్లాలోని మిల్లర్లతో కూడా సమన్వయంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారువీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యచందన, పౌరసరఫరాల అధికారి రుక్మిణి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ త్రినాధ్ బాబు, వ్యవసాయ శాఖ బాబురావు తదితరులు పాల్గొన్నారు