రావులపాలెం లో నిర్వహణకు సన్నాహాలు…
తెలంగాణ లోనూ ప్రాంతీయ బోర్డ్ ఏర్పాటుకు రైతులు డిమాండ్…
పయనించే సూర్యుడు జనవరి 10
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్
ఈ నెల 12 న రావులపాలెం సీఆర్సీ క్లబ్ లో కొబ్బరి అభివృద్ధి బోర్డు 45 వ ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాటుకు నిర్ణయించారు.ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు,వాసం శెట్టి సుభాష్,ఎంపీ గంటి హరీష్ మాధుర్,జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు,కొబ్బరి అభివృద్ధి బోర్డు చైర్మన్ శుభా నాగరాజన్,హార్టికల్చర్ కమిషనర్,కొబ్బరి అభివృద్ధి బోర్డు సీఈవో ప్రభాత్ కుమార్ కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తదితర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు.
కొబ్బరి అభివృద్ధి బోర్డు 1980 వ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో మొదటిసా రిగా ప్రారంభించారు.ఆ తరువాత దీని అనుబంధ కార్యాలయాలు కొబ్బరిపంట సాగు చేస్తున్న అన్ని రాష్ట్రాల్లో డిప్యూటీ డైరెక్టర్ స్థాయిలో ఏర్పాటు చేసి సేవలు అందిస్తు న్నారు.ఏపీలో విజయవాడ కేంద్రంగా కొబ్బరి అభివృద్ధి బోర్డు కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ గా కుమార్ వేల్ ప్రస్తుతం బాధ్య తలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 45 వ ఆవి ర్భావ దినోత్సవం నిర్వహించనున్నారు.దీన్ని కోనసీమలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.
ఎన్నో రకాల ఎల్డీపీ(లేయింగ్ ఆఫ్ డీమాన్ సేవలు
కొబ్బరి అభివృద్ధి బోర్డు ద్వారా (స్టేషన్ ప్లాంట్స్), రియేనేషన్ అండ్ రీప్లాంటేషన్(ఆర్అండ్ఆర్) వంటి ఎన్నో రకాల పథకాలను రైతుల కోసం అందించారు. కొబ్బరి పండించే ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ పై ఇంకా ఏదో వివక్ష కొనసాగుతూనే ఉంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భవించి 15 ఏండ్లు అవుతున్నా ఈ తెలంగాణ లో ప్రాంతీయ బోర్డ్ ను ఏర్పాటు చేయకుండా ఆంధ్రప్రదేశ్ విజయవాడ కేంద్రంగా తెలంగాణ లోనూ సేవలు అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆవిర్భావ సభకు తెలంగాణ ప్రాంత కొబ్బరి సాగు చేసే రైతులు ఎక్కువ మంది పాల్గొని తమ వాణి విని పించాల్సి ఉంది. పథకాల పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
కొబ్బరి బోర్డు ఆవిర్భావ విన్నపం వేడుకలకు రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని రైతుసంఘం నాయకులు తుంబూరు మహేశ్వర రెడ్డి,కొక్కెరపాటి పుల్లయ్య లు పిలుపునిచ్చారు.
మధ్యాహ్నం భోజన విరామం అనంతరం అధికారులు,నిపుణులు పాల్గొని కొబ్బరి సాంకేతిక సహకారం,సలహాలు అందించే అవకాశం ఉందన్నారు.