కొమరం భీమ్ విగ్రహానికి ఘన నివాళులు

- కొమరం భీమ్ ఆశయ సాధనకై ఆదివాసి ప్రజానీకం ఉద్యమించాలి
- పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి అక్టోబర్ 7 కొమరం భీం
- ఆశయ సాధనకై నేటి ఆదివాసి యువతరం ఉద్యమించాలని,నీ హక్కుల కోసం పోరాడకపోతే ఆ మహనీయుల త్యాగాలకు విలువ ఉండదని, ఈ సమాజం నిన్ను ప్రతిరోజు అణచివేస్తూనే ఉంటుందని ఆదివాసీ ఉద్యమాలకు ప్రతి ఒక్కరు కదిలి రావాలని ఆదివాసి జెఎసి రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్ పిలుపునిచ్చారు. కొమరం భీమ్ 85వ వర్ధంతి సందర్భంగా స్థానిక కూనవరం మండలం కోతులగుట్ట గ్రామంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం సోడే ముత్తయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు మాట్లాడుతూ,15 ఏళ్ల వయసులోనే అటవీ సిబ్బంది చేసిన దాడిలో తండ్రి మరణించగా కొమరం భీం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్దార్ పూర్ కు వలస వెళ్లిందని,అక్కడ నుంచే కొమరం భీమ్ నిజం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బెబ్బులిలా పోరాడాడని, అతను అడవిని జీవన ఉపాధిగా మలుచుకుని, నిజం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు సేకరించి,ఆసప్ జహీ రాజవాసం కు వ్యతిరేకంగా పోరాడాడని,అలాగే నిజాం ప్రభుత్వం పశువుల కాపర్లపై విధించిన సుంకాలు వ్యతిరేకంగా పోరాడడని,అదేవిదంగా జల్ జంగిల్ జమీన్ నినాదంతో అందరిని ఐక్యం చేస్తూ పోరాటాన్ని సాగించాడని ఈ పోరాటపటిమా ప్రతి ఆదివాసి అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ డివిజన్ నాయకులు మదల.చంటి,ఆదివాసీ ఉపాధ్యాయులు చిచ్చడి బాబురావు, చిచ్చడి అప్పారావు, చిచ్చడి చంద్రరావు, సీత, రాధా,కట్టం రమేష్,సోడే. అర్జున్, బేతి ముత్తయ్య,కరక అర్జున్, కుడియం కామరాజు,తదితరులు పాల్గొన్నారు.
https://www.pstelugunews.com