
పయనించే సూర్యుడు అక్టోబర్ 22 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి : బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మెర వరప్రసాద్ అధ్యక్షతన కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించడం జరిగినది ఈ సందర్భంగా బొమ్మెర వరప్రసాద్ మాట్లాడుతూ జల్ జంగిల్ జమీన్ కోసం నైజాం నవాబులపై తిరుగుబాటు చేసి అమరుడైన కొమరం భీమ్ ఆదివాసి వీరుడు త్యాగం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ యొక్క కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆదేశాల మేరకు టేకులపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బోడ.బాలు నాయక్ మాజీ ఎంపీటీసీ అప్పారావు బర్మావత్ శివకృష్ణ లచ్చు నాయక్ చీమల రామకృష్ణ కరుణాకర్ మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ టిఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు ఆమడ రేణుక బన్సీలాల్ సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మాలోత్ రాజేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు