పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 22
ఏజెన్సీలోని ఆదివాసీలు హక్కులు కాపాడుకోవడం కోసం ఆదివాసి పోరాటయోధులు జల్ జంగిల్ జమీన్ హమారా నినాద సృష్టికర్త కొమరం భీమ్ గారి పోరాట స్ఫూర్తితో హక్కుల సాధన కోసం ప్రతి ఆదివాసీ ఉద్యమించాలని సిపిఎం జిల్లా నాయకులు సిసం సురేష్ పిలుపునిచ్చారు.బుధవారం నాడు చింతూరు పార్టీ కార్యాలయంలో అమరజీవి ఆదివాసి ఉద్యమ నాయకుడు కొమరం భీమ్ 125వ జయంతిని పురస్కరించుకుని కొమరం భీం చిత్రపటానికి మండల సీనియర్ నాయకులు మడకం చిన్నయ్య గారు పూలమాల వేసినారు అనంతరం పాల్గొన్న కార్యకర్తలను ఉద్దేశించి జిల్లా కమిటీ సభ్యులు సిసం సురేష్ మాట్లాడుతూ ఉమ్మడి అదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ ప్రాంతంలో 1901లో జన్మించిన కొమరం భీమ్ ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వం నైజాం ప్రభుత్వం ఏజెన్సీలోని ఆదివాసులపై చేస్తున్న దుర్మార్గపు దోపిడీలపై ప్రజలను ఐక్యం చేసి పోరాటం చేసిన మహా నాయకుడు ఏజెన్సీ ప్రాంతంలోని జల్ జంగిల్ అమరా అంటూ బ్రిటిష్ నైజాం సర్కార్లు గడగడ లాడించి ఆదివాసులు హక్కుల కోసం నినదించిన నాయకుడు అని ఆనాడు భూ దోపిడీతోపాటు పంటను సైతం రాబందుల్లా దోచుకుంటుంటే యుక్త వయసులోనే సాయుధ పోరాటాన్ని ఎంచుకున్న ఐక్యం చేసి పోరాటాన్ని నడిపిన మహా నాయకుడు మన కొమరం భీం ఈనాటి పాలకులు ఏజెన్సీ ప్రాంతంలోని ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ పెద్దలకు దోచి పెట్టాలని ఏజెన్సీ ప్రాంతంలోని సహజ వనరులను చట్టాలకు విరుద్ధంగా కట్టబెడుతున్నారని అంతేకాకుండా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తూ ఏజెన్సీ చట్టాలను నీరుగా చర్యలు చేపట్టారని మన హక్కుల సాధన కోసం పోరాటయోధుడు జీవి కొమరం భీమ్ ఆశయాల సాధనకై పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు పోడియం లక్ష్మణ్ రమేష్ కారం మనోజ్, కూర సత్యనారాయణ, కలుముల ముత్తయ్య , కట్టం బాబురావు, నాగేశ్వరరావు, జానీ, కట్టం గంగమ్మ, సింగమ్మ, తదితరులు పాల్గొన్నారు.