పయనించే సూర్యుడు ఫిబ్రవరి 6 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ మహిళా జనరల్ సెక్రటరీ గా గంధం సాయి లీల ని నియమించిన సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మధ్యదాపూర్వకంగా కలిశారు. అనంతరం హన్మంత్ రెడ్డి పార్టీ కార్యాలయంలో ఆమెను శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. పార్టీ అభివృద్ధి కోసం రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని ఆమెకు సూచించారు ఈ కార్యక్రమం లో అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి , సీనియర్ కాంగ్రెస్ నాయకులు అరవింద్ ,కోలన్ జీవం రెడ్డి ,రాజి రెడ్డి , ప్రశాంత్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు