పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి10 : మక్తల్ కోల్పూర్ గ్రామం మాగనూరు మండలం, నారాయణపేట జిల్లా పరిధిలోని కొల్పూరు గ్రామపంచాయతీ ఆవరణలో మంగళవారం జరిగే అతిపెద్ద జాతర అయినటువంటి శ్రీ శ్రీ శ్రీ గజ్జలమ్మ జాతర కు కోల్పూర్ గ్రామం తో పాటు చుట్టూ పరికరాల ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మహాత్మ జ్యోతిబాపూలే వారధి కమిటీ ఆధ్వర్యంలో కోరుతున్నాం ఈ జాతర మహోత్సవం చాలా అద్భుతంగా డోలు వాయిద్యాలు డప్పుల చప్పులతో పాటు బోనం కొండలు నెత్తిన పెట్టుకొని గ్రామం నుండి అమ్మవారి దేవాలయం వరకు కార్యక్రమాన్ని చూసి తిలకించవలసిందిగా ప్రతి ఒక్కరికి మహాత్మ జ్యోతిబాపూలే వారధి కమిటీ సభ్యుల తో పాటు గ్రామ పెద్దలు యువకులు నాయకులు తదితరులు కోరుతున్నారు