
//పయనించే సూర్యుడు// న్యూస్ డిసెంబర్,7 //నారాయణపేట జిల్లా బ్యూరో//
నారాయణపేట జిల్లా, కోటకొండ డబుల్ రోడ్డును వెంటనే పూర్తిచేయాలని బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందించడం జరిగింది.అప్పకిపల్లి నుండి కోయిలకొండకు 2022 - 23 సంవత్సరంలో డబుల్ రోడ్డు మంజూరు,అయింది . అట్టి రోడ్డుపనుల్లో బొమ్మనుపాడ్ నుండి బోయిలపల్లి వరకు రోడ్డు పనులు ఆపివేశారు,మరియు కోటకొండ గ్రామ శివారులో ఫారెస్ట్ పర్మిషన్ రాలేదని అట్టి పనులుకూడా నిలిపివేశారు అదేవిధంగా కోటకొండ గ్రామంలోకూడా ఎలాంటి పనిని ప్రారంభించలేదు.ఇట్టి పనులు ఆపడంవలన రోడ్డుపై వెళ్ళే ప్రజలకు దుమ్ము ,ధూళితో పాటు ప్రయాణంకూడా నరకప్రాయంగా మారింది.పల్లెప్రజలు వైద్యం కోసం నారాయణపేట వెళ్ళడానికి , అంబులెన్సు గ్రామాలకు రావడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు.గత వర్షాకాలంలో రోడ్డు బురదమయమయ్యి బస్సులు రాక నారాయణపేటకు వెళ్లే విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడ్డారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని,రోడ్డు పనులు వెంటనే పూర్తిచేయాలని చాలా సార్లు ధర్నాలు, చేయడం జరిగింది. ఇదే విషయమై కలెక్టర్కు వినతిపత్రం ఇచిన,ఎన్నోసార్లు స్థానిక శాసనసభ్యులకు తెలియజేసిన.ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు నేటికి ఎలాంటి పురోగతిలేదు.గత ప్రభుత్వంలో మంజూరైన రోడ్డు ప్రస్తుత ప్రభుత్వంలో పనులు జరగక పోవడం విడ్డూరంగా ఉందని,ఎద్దేవా చేశారు.కోటకొండ డబుల్ రోడ్డుపనులు వెంటనే ప్రారంభించి రోడ్డును పూర్తి చేయాలని లేనిపక్షంలో అదే రోడ్డుపై బైఠాయించి,ధర్నాలు , రాస్తారోకోలు, నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కోట కొండ గ్రామసర్పంచ్ ఈడ్గి వెంకట్రాములు గౌడ్,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కెంచే శ్రీనివాసులు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వేపూర్ రాములు,గ్రామ్ ఉపసర్పంచ్ చేన్నప్ప యాదవ్,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సాక ప్రవీణ్,మరియు నాయకులు చెందులాల్ ,వరంగల్ చంద్ర శేఖర్, వెంకటయ్య , గొల్ల చేనప్ప తదితరులు పాల్గొన్నారు.