ఏసీపి శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేస్తున్న బిజెపి నాయకులు…
రుద్రూర్, ఆగస్టు 4 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండల బిజెపి అధ్యక్షులు ఆలంపాటి హరికృష్ణ పై కోటగిరి ఎస్సై సునీల్ వ్యవహరించిన తీరు పట్ల బోధన్ ఏసిపి శ్రీనివాస్ కు సోమవారం ఫిర్యాదు చేశారు. రుద్రూరు మండల కేంద్రంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో కోటగిరి గ్రామంలో కటింగ్ చేసుకుందామని కటింగ్ షాప్ కి వెళ్లడం జరిగిందని, కోటగిరి ఎస్సై సునీల్ అక్కడ కటింగ్ చేపించుకుంటున్నారు. ఆ సందర్భంలో ఎస్సై సునీల్ నన్ను అరే ఎవడ్రా బాబు నువ్వు బయటకు పో ఇక్కడ నేను వున్నా కనిపించడం లేడా నీకు అని దుర్భాషలాడారు. నేను రుద్రూర్ మండల బీజేపీ మండల అధ్యక్షులు అని చెప్పిన కూడా నువ్వు బిజెపి అధ్యక్షుడు అయితే నేను భయపడాలా నీకు పో బయటకి అని అన్నారు. ఎస్సై ఇక్కడ నుండి బయటకి వెళ్ళిపో అంటే నేను అక్కడి నుంచి వెళ్లలేదు. అప్పుడే రక్షకులని పదిమంది పోలీసులను పిలిపించి నాకు కటింగ్ చేయొద్దు అని షాప్ బంద్ చేయండి అని కటింగ్ షాప్ వర్కర్ కి చెప్పి వెళ్ళిపోయాడు. నేను బిజెపి మండల అధ్యక్షుడు అని చెప్పిన తర్వాత కూడా నన్ను ఇలా ఇబ్బందికి గురి చేశారు. వాంటెడ్లీ నన్ను కావాలనే ఇలా బెదిరించి మాట్లాడటం జరిగింది. ఎస్సై పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏసీపీకి చేయడం జరిగిందన్నారు.