పయనించే సూర్యుడు అక్టోబర్ 13 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
ఈరోజు సూళ్లూరుపేటలో అంబేద్కర్ విగ్రహం దగ్గర మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ అమలు దినోత్సవం రాష్ట్ర మహాసభలు కోట నందు జరుపుతున్నారు ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలంటూ పోస్టర్ని విడుదల చేశారు ఈ కార్యక్రమం మాల మహానాడు సూళ్లూరుపేట మాలమహానాడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు మరియు బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీంజూరు మాధవ్, మాల మహానాడు రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ ఆవల దాస్ ,మరియు కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి, దళిత నాయకులు కన్నంబాకం హరికృష్ణ, వీరందరూ మాట్లాడుతూ నవంబర్ 23వ తేదీన కోట లో జరగబోయే రాజ్యాంగ అమలు దినోత్సవం సభను జయప్రదం చేయాలని అందరికీ పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో మాల మహానాడు సూళ్లూరుపేట నాయకులు సుదీర్, గోకుల్,ఐడిజెఎన్ డి కిరణ్ కుమార్ శ్యామ్,దళిత నాయకులు, ఎ ఎస్ ఎస్ పిట్ల చిన్న, మల్చి వీరయ్య, చెంగల్ రాయులు,కే చిన్నయ్య, కే రాజేష్, సాయి తదితరులు పాల్గొన్నారు