పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 28:- రిపోర్టర్ (కే శివ కృష్ణ)
రాజకీయం నీవు తినే ఫుడ్ లో ఉందేమో.. నాకు బ్లడ్ లో ఉంది. ఇది ఒక సినిమాలో పాపులర్ డైలాగ్. రాజకీయం అంటే తొడలు కొట్టటం.. మీసాలు మేలేయటం..కాదు. ప్రశాంతంగా పని చేసుకొని అనుకొన్నది సాధించటం. పిట్టలవానిపాలెం ఎంపీపీ పీఠం వైసిపి తిరిగి కైవసం చేసుకోవటానికి బాపట్ల వైసిపి ఇన్చార్జి, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు పక్కా ప్రణాళిక రచించారు. ప్రశాంతంగా తన ప్రణాళికను అమలు చేశారు. మొత్తం మీద ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఎన్నిక ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా ముగిసింది. ఎంపీటీసీ లందరూ ఏకతాటి మీదకు వచ్చి ఏకగ్రీవంగా అనుకున్న మాట ప్రకారం క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రామరాజు ని ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఇచ్చిన మాట కోసం ఎంతవరకైనా సరే నిలబడతాడు అని మాజీ డిప్యూటీ స్పీకర్ బాపట్ల వైసిపి ఇన్చార్జ్ కోన రఘుపతి మరోసారి నిరూపించుకున్నారని క్షత్రియ సామాజిక వర్గం నేతలు గర్వంగా చెబుతున్నారు. పిట్టలవాని పాలెం ఎంపీపీ గెలుపు వైసిపి పార్టీలో మంచి జోష్ నింపింది. వర్ధిల్లాలి కోన రఘుపతి నాయకత్వం.. జై జగన్ అనే నినాదాలతో పిట్టలవానిపాలెం మండల పరిషత్ కార్యాలయం మారుమోగింది.