
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్
కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఎలాంటి విజయవత్సవ ర్యాలీలకు అనుమతి లేదు 163 బి ఎన్ ఎస్ ఎస్ చట్టము పటిష్టంగా అమలు ఎన్నికల నియమ నిబంధనలు తప్పనిసరి పాటించాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు – 2026 లో జరిగిన రెండవ సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు తేది: 13-02-2026 నాడు ఈ దిగువ తెలియజేసిన ప్రాంతాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.1) ప్రభుత్వ పాలిటెక్నిక్ (బాలురు) నిజామాబాద్ 2) విజయమేరి హై స్కూల్, బోధన్ 3) ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పిప్రి రోడ్, ఆర్మూర్
4) ప్రభుత్వ జూనియర్ కళాశాల, భీమ్గల్ తరువాత నిజామాబాద్ పోలీస్ మిషనరేట్లో మేయర్ మరియు చైర్పర్సన్ల ఎన్నికల ప్రక్రియ 16-02-2026న ఉన్నది.కావున నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజాశాంతి, శాంతి మరియు ప్రశాంతతను కాపాడాలనే ఉద్దేశ్యంతో, పరిస్థితిని సమీక్షించిన తరువాత, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐపిఎస్., నిజామాబాద్ (మెట్రోపాలిటన్ ఏరియా) పోలీస్ చట్టం మరియు 163 బిఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 22 (1) (డి) నుండి (ఎఫ్) మరియు 22 (2) (ఎ) నుండి (ఇ) మరియు 22 (3) కింద నాకు ఇవ్వబడిన అధికారాన్ని వినియోగించుకుని, ఈ క్రింది నిషేధ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది.పైన పేర్కొన్న (4) ప్రదేశాల పరిమితుల్లోని లెక్కింపు కేంద్రం నుండి 5 కిలోమీటర్ల వ్యాసార్థంలో (05) లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని నిషేధం(05) లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని మరియు ఏ విధమైన ఊరేగింపులను నిర్వహించ రాదు, పూర్తిగా నిషేధంవిజయోత్సవ ర్యాలీ, బైక్ ర్యాలీ, పటాకులు కాల్చడం నిషేధించబడింది.4. ప్రజా రహదారులపై లేదా బహిరంగ ప్రదేశాలలో శాంతి భద్రతలకు భంగం కలిగించే లేదా ప్రజలకు అసౌకర్యం, చికాకు లేదా ప్రమాదాన్ని కలిగించే వ్యక్తులు గుమిగూడడాన్ని నిషేధం5. ముందస్తు అనుమతి లేకుండా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి బహిరంగ సమావేశాలు మరియు ఊరేగింపులు నిర్వహించడాన్ని నిషేధించడం జరిగింది.వివిధ వర్గాలు లేదా వ్యక్తుల మధ్య మతపరమైన వైరం లేదా ద్వేషాన్ని సృష్టించే లేదా చట్టాన్ని లేదా చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించే లేదా భంగం కలిగించే నేరానికి దారితీసే చిత్రాలు, ఫ్లెక్సీలు, చిహ్నాలు, ప్లకార్డులు లేదా ఏదైనా ఇతర వస్తువులను ప్రదర్శించడం, ప్రసంగించడం, సంజ్ఞ చేయడం లేదా అనుకరించడం, లేదా వ్యాప్తి చేయడం నిషేధించబడింది.7. ఊరేగింపులు, పెద్ద సమావేశాలు లేదా సమావేశాలలో వ్యక్తులు కౌంటింగ్ కేంద్రం నుండి ఒక కి.మీ. వ్యాసార్థంలో జెండాలు, లాఠీలు, తుపాకీలు లేదా దాడి లేదా రక్షణ కోసం ఆయుధాలుగా ఉపయోగించగల ఏవైనా ఇతర ఆయుధాలతో లేదా లేకుండా కర్రలను తీసుకెళ్లడాన్ని నిషేధించడం జరిగింది.8. రహదారులు, బహిరంగ ప్రదేశాలు మరియు ప్రజలు రద్దీగా ఉండే ఇతర ప్రదేశాలలో షామియానాలు, పండళ్లు, ఖన్నత్ వంటి తాత్కాలిక నిర్మాణాలను నిర్మించడాన్ని నిషేధం గలదు.9. ముందస్తు అనుమతి లేకుండా ఏదైనా సంస్థ, ప్రజా సభ్యులు మొదలైన వారు మైకులు/పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వాడటం, వాహనాల ద్వారా హారన్ వాడటం నిషేధం గలదు.సంగీతం, పాటలు పాడటం లేదా ప్రసంగాలు లేదా స్పీకర్లు లేదా ఇతర వాయిద్యాల ద్వారా ప్రసారం చేయడాన్ని నిషేధించడము జరిగింది.ఇట్టి ఉత్తర్వులు ఈ దిగువ తెలియజేసిన వారికి మాత్రమే మినహాయింపు గలదు ఎ) విధుల్లో ఉన్న పోలీసు అధికారులు (హోం గార్డ్లు మరియు SPOలతో సహా) బి) విధుల్లో ఉన్న సైనిక/పారా సైనిక సిబ్బంది సి) విధుల్లో ఉన్న ఎన్నికల అధికారులు.పైన పేర్కొన్న ఆదేశాలను ఉల్లంఘించిన ఏ వ్యక్తి అయినా బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజలకు ఇందుమూలంగా తెలియజేస్తున్నాము.ఇట్టి ఉత్తర్వులు తేది : 13-02-2026 ఉదయం 0600 గంటల నుండి 17-02-2026న ఉదయం 0600 గంటల వరకు అమలులో ఉంటుంది.