పయనించే సూర్యుడు గాంధారి 15/07/25
పరామర్శతో పాటు ₹5 లక్షల నష్టపరిహారం, ఉద్యోగ హామీ, ఇల్లు నిర్మాణానికి సహాయం గాంధారి మండలానికి చెందిన ముదెల్లి గ్రామంలో శనివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. కౌలు రైతు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటన గ్రామాన్ని తీవ్ర విషాదంలో ముంచింది
దీనిపై వెంటనే స్పందించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు, అధికారిక కార్యక్రమాల వలన శనివారం వెళ్లలేకపోయినప్పటికీ ఆదివారం సాయంత్రం బాధిత కుటుంబాన్ని వ్యక్తిగతంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్‌తో టెలిఫోన్లో మాట్లాడి, బాధిత కుటుంబానికి తక్షణంగా ₹5 లక్షల నష్టపరిహారం మంజూరు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా వ్యవసాయ శాఖ అధికారులతో సంప్రదించి రైతు భీమా పరిహారాన్ని త్వరగా జమ చేయాలని సూచించారు మృతుడి చిన్న కుమార్తె అఖిలకు ఉద్యోగ హామీ ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కేటాయించి, నిర్మాణానికి అవసరమైన సామగ్రి సిమెంటు ఇటుక కాంక్రీట్ స్టీల్ ను తాను సొంత డబ్బులతో సమకూరుస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాగుల మోహన్ యాదవ్ పెద్దకాపు దేశని సాయిలు వడ్డే రాజయ్య, బల్గురి రాజు కిరణ్ గౌడ్ పల్లె కాశీరాం కర్రోల సాయిలు పోకల రాము తదితరులు పాల్గొన్నారు గ్రామస్థులు కూడా భారీ సంఖ్యలో హాజరై బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచారు గ్రామస్థులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తక్షణ స్పందనను అభినందిస్తూ, ఈ చర్యలు బాధిత కుటుంబానికి కొండంత అండ అని అభిప్రాయ వ్యక్తం చేశారు