పయనించే సూర్యుడు ఆగస్టు 26( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమంలో భాగంగా . క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక .ఎంపీపీ .తూమాటి విజయభాస్కర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు భూదల వీర రాఘవరెడ్డి. తాసిల్దారు బీ. మురళి. ఎంపీడీవో అమర్. ఆర్ఐ సతీష్ ల. చేతులు మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు . లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది . ఈ సందర్భంగా ఎమ్మార్వో బి .మురళి మాట్లాడుతూ 10,827 స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని. సదరు కార్డులను ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుందని. మిగిలిన లబ్ధిదారులకు త్వరలోనే కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు