పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 16 టంగుటూరు రిపోర్టర్
టంగుటూరు ఎంఈఓ ఆఫీస్ నందు జరిగినటువంటి ప్రత్యేక సమావేశంలో …ఈ నెల 17, 18 ,19, తేదీల్లో టంగుటూరు మండల స్థాయిలో జరుగు స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆటలు పోటీల నిర్వహణ గురించి, సన్నాహా కార్యక్రమాల గురించి, మండల ఎంఈఓ చెల్లి ఆనందరావు గారు, టి .బాలాజీ గారు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టినటువంటి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆటలు పోటీల వలన పిల్లల్లో పోటీ తత్వం, మానసిక వికాసం కలుగుతుందని, అలాంటి ఆటలు పోటీలను మండలంలోని పిడి లు అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించాలని, అదేవిధంగా ఈ యొక్క మండల స్థాయి కార్యక్రమాలకు గ్రామ పెద్దల్ని , దాతలను,మిగతా వారిని భాగస్వామ్యం చేసుకొని విజయవంతం చేయాలని ఎంఈఓ ఆనందరావు గారు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ ఎన్ అరుణ, టి అశోక్ బాబు, రాజ్యలక్ష్మి , పి.వెంకట్రావు, చిరంజీవి, మోహన్రావు ,ప్రశాంతి, కౌశల్య శ్రీవిద్య, సుప్రజ పాల్గొన్నారు* .