
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ భీంగల్ మున్సిపల్ పరిధిలో
నియోజకవర్గం లో క్రీడ ప్రేమికులు ఇంకా ఉండటము వల్లనే ఇంకా క్రీడలు సజీవంగా ఉన్నాయి.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..భీంగల్ మండల కేంద్రంలో భీంగల్ మండల 69 వ ఎస్ జి ఎఫ్ అంతర పాఠశాల క్రీడా పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొని క్రీడాజ్యోతి ని వెలిగించి క్రీడలను ప్రారంభించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..భీంగల్ మండలంలో మండల స్థాయి క్రీడలను ఇంత గొప్పగా జరుపుకోవడం అభినందనీయం ఇంట్లో పండుగ లాగా ఈ క్రీడోత్సవాలను జరుపడానికి కృషి చేస్తున్న అన్ని పాఠశాల ల ఉపాధ్యాయ బృందం పి ఈ టి బృందానికి అభినందనలు ఇప్పుడున్న కాలంలో డబ్బులు ఉంటే పెళ్లి చేయడం చాలా సులువు కానిఆర్థిక వనరులున్న అందరిని ఒక్కతాటి పైకి తీసుకోచ్చి క్రీడలను నిర్వహించి విజయవంతం చేయడం అంత సులువు కాదు. విద్యా సాగర్ రెడ్డి,రాజ్ కుమార్ ,మల్లేష్, లాంటి క్రీడా ప్రేమికులు ఉండటం వల్లనే ఇంకా క్రీడలు గొప్పగా నిర్వహిస్తున్నారు. క్రీడలు సజీవంగా ఉండటానికి మీ కృషి అభినందనీయం.. గ్రామీణ స్థాయి నుండి క్రీడల్లో రాణించి రాష్ట్ర దేశ స్థాయిలో ఆడిన వాళ్ళు ఉన్నారు వారిని మీరంత స్ఫూర్తిగా తీసుకోవాలి. క్రీడలు అనేవి కేవలం ఫిట్ నెస్ కోసమే కాదు..జీవితంలో మనకు ఎదురు దెబ్బలు తగిలినపుడు వాటిని తట్టుకొని నిబ్బరంగా మనో ధైర్యంగా ఉండటానికి క్రీడలు ఉపయోగపడతాయి. క్రీడల్లో గెలుపోటములు సహజం..అన్నింటిని సమానంగా తీసుకోవాలి..అప్పుడే స్పోర్టింగ్ స్పీరిట్ విద్యార్థుల్లో అలవడుతుంది.తల్లుదండ్రులు కూడా మీ పిల్లలను చదువుల్లోనే కాకుండా క్రీడల్లో కూడా ప్రోత్సహించాలి అని అన్నారు..క్రీడలు మీ భవిష్యత్తు ని తీర్చిదిద్దుకోవడానికి దోహదపడుతాయిక్రీడలు శారీరక దృఢత్వమ్ తో పాటు మానసిక ధైర్యాన్ని స్థిరత్వాన్ని ఇస్తాయి. మా కుటుంబంలో నేను, మా తండ్రి, చెల్లెలు అందరు జాతీయ స్థాయి క్రీడాల్లో పాల్గొన్నవారమే.
నిత్యము క్రీడలు ఆడటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మంచిగా జరిగి బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. శరీరాన్ని మన అదీనంలో ఉంచుతుంది. క్రీడలు లాంటివి ఆడకపోవడం వల్ల యువత పెడత్రోవన పడుతూ గంజాయి లాంటి వ్యాసనాలకు అలవాటు పడుతున్నారు ఇక్కడ ఉన్న క్రీడా అభిమానులు జాతీయ స్థాయి క్రీడలు నిర్వహిస్తే నా సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తాను. ఈ సందర్బంగా మార్చ్ ఫాస్ట్ లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు మెమెంటో బహుమతులు అందజేశారు
