ఎమ్మెల్సి నాగరకుంట నవీన్ రెడ్డి
ముగిసిన ఎంపిఎల్-9 క్రికెట్ టోర్నమెంట్
క్రీడాకారులకు బహుమతులు అందచేసిన ఎమ్మెల్సి నాగరకుంట నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని క్రీడలలో జయాపజయాలు సహజమని వాటిని సమానంగా తీసుకొని లక్ష్యం వైపు పయనిస్తే ఏదో ఒక రోజు విజయం తప్పకుండా వరిస్తుందని క్రీడాకారులను ఉద్దేశించి ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు.రంగా రెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లి గ్రామంలోఎంపిఎల్-9 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్సి నాగరకుంట నవీన్ రెడ్డి క్రీడాకారులకి బహుమతులను అందచేస్తూ విన్నర్ టీం మామిడిపల్లి కి 30,000 నగదును మరియు రన్నర్ టీం మొదల్లగూడకు 20000 నగదును అందచేశారు.ఈ కార్యక్రమం లో మామిడిపల్లి మాజీ ఎంపిటిసి కట్న మాదవి రవీందర్, ఉపసర్పంచ్ లు సత్యనారాయణ, హన్మంత్ రెడ్డి,సింగిల్ విండో డైరెక్టర్ యాదగిరి రెడ్డి,వార్డ్ మెంబెర్స్,రఘుపతి రెడ్డి,వెంకటేష్ రెడ్డి,ప్రభు, బీఆర్ఎస్ నాయకులు ప్రతాప్ రెడ్డి,దామోదర్ రెడ్డి,జ్ఞానేశ్వర్, మొయినోదిన్,కుమ్మరి క్రిష్ణయ్య, పురుషోత్తంరెడ్డి,ఆశ్రఫ్,వినోద్,రాంరెడ్డి,శ్రీశ్రీనివాస్ రెడ్డి,ఆంజనేయులు గౌడ్,క్రిష్ణ రెడ్డి,సి.ప్రభాకర్ రెడ్డి,జగన్ రెడ్డి,మధు,సతిరెడ్డి,రాజు,మనోహర్,శ్రీకాంత్, ఆర్గనైసర్స్ చిట్టీ,చందు,మజీద్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.