వైస్ ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి
{ పయనించే సూర్యుడు} {అక్టోబర్ 18}మక్తల్
తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ ఐలయ్య ఆధ్వర్యంలో, సెప్టెంబర్ 22 నుండి 24 వరకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు లో జరిగిన 44వ, జూనియర్ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో రాష్ట్రంలోని 32 జిల్లాలు పాల్గొనగా, నారాయణపేట జిల్లా బాలుర జట్టు సి. గ్రూపులో రన్నర్ గా నిలవడానికి ,మక్తల్ సాయి జ్యోతి ఉన్నత పాఠశాల బాలురు, యు. మల్లేష్, డి. రమేష్ జట్టులో పాల్గొని, క్రీడా నైపుణ్యతను ప్రదర్శించి జిల్లా జట్టు గెలవడానికి కృషి చేశారు. సాయి జ్యోతి ఉన్నత పాఠశాల క్రీడాకారులకు ఈ నెల 17న రాష్ట్ర, ఉపాధ్యక్షుడు బి.గోపాలం,పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గోపాల్ రెడ్డి, పి ఈ టి అనిత సర్టిఫికెట్స్ ,మెడల్స్ అందజేసి ఘనంగా సన్మానించి, అభినందించారు. అనంతరం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మా విద్యార్థులకు క్రీడారంగంలో పూర్తి సహకారం అందిస్తామని, క్రీడల వలన మానసిక ఉల్లాసము సంపూర్ణ ఆరోగ్యము కలుగుతాయని ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రశంసా పత్రాలు పొందిన విద్యార్థులను అందుకు కృషి చేసిన పిఈటి అనితను రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.గోపాలం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సత్య ఆంజనేయులు, ఎస్ .రమేష్ కుమార్ ,పాఠశాల హెచ్ఎం వెంకటయ్య, చైర్మన్ నర్సింలు, వైస్ ప్రిన్సిపల్ గోపాల్ రెడ్డి ఉపాధ్యాయ బృందము, అభినందించారు.