పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి సెప్టెంబర్ 11
గురువారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ సభ్యులు రంపచోడవరం మండలం నరసాపురం గ్రామం లో గల క్వారీ వల్ల నష్టపోతున్న బాధితులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కొంతమంది నాన్ ట్రైబల్స్ నరసాపురం గ్రామస్తులను రెచ్చగొట్టి నిరంతరం ఆదివాసి సమాజం కోసం పాటుపడుతున్న ఆదివాసి సంక్షేమ పరిషత్ పై తప్పుడు ఆరోపణ చేయించడం సరికాదని, క్వారీ వలన నష్టపోతున్న బాధితులు తమను ఆశ్రయిస్తేనే తాము క్వారీ వల్ల జరుగుతున్న అక్రమాలపై బాధితులకు జరుగుతున్న నష్టం పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడమైనది ఆయన తెలియజేశారు. క్వారీ వెనక ఉన్న కొంతమంది నాన్ ట్రైబల్స్ ఆదివాసులను రెచ్చగొట్టి తామపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని. క్వారీ కి సంబంధించి ఆదివాసి సంక్షేమ పరిషత్ ఏనాడు కూడా ఎవరి దగ్గర రూపాయి ఆశించలేదని, ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయిస్తే దీని వెనుక ఉన్న కుట్ర దారులకు తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. ఆదివాసీల అభివృద్ధి కోసమే ఆదివాసి సంక్షేమ పరిషత్ పాటుపడుతుందని, ఆదివాసుల్ని నష్టపరిచే విధంగా ఏ రోజు ఆదివాసి సంక్షేమ పరిషత్ సంఘం ప్రయత్నించలేదని, గ్రామంలోని మొదట కొంతమంది గ్రామస్తులు క్వారీకి సంబంధించిన లెక్కలు అడగగా , బినామీలుగా వ్యవహరిస్తున్న కొంతమంది మీకు చెప్పవలసిన అవసరం లేదని అదే గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులతో వాగ్వాదము చేయడంతో ఆ గ్రామస్తుల స్వయంగా మా సంఘం ప్రమేయం లేకుండా ఐటిడిఏ రంపచోడవరం లో ఫిర్యాదు చేయడం జరిగిందని. ఆ తర్వాత ఫిర్యాదుదారులను, క్వారీల బినామీదారు లు మరియు దాన్ని వెనకున్న నాన్ ట్రైబాల్స్ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేశారని అయినా లొంగకపోతే పలు విధాలుగా భయపెట్టే సాగారని, ఈ తరుణంలోనే ఆ గ్రామంలో ఉన్న మరి కొంతమంది బాధితులు బయటకు వచ్చి, ఫిర్యాదుదారులు మరియు క్వారీ వల్ల నష్టపోతున్న రైతులు, క్వారీ బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ఇల్లు ధ్వంసమైన బాధితులు ఆదివాసి సంక్షేమ పరిషత్ సంఘాన్ని ఆశ్రయించారని, ఆ తర్వాత క్వారీ పై జరిపిన పలు దర్యాప్తులలో సంఘం దృష్టికి అనేక అవకతవకలు వచ్చాయని దాని ఆధారంగానే నరసాపురంలోని గ్రామస్తులతో కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. కొంతమంది చెప్పుడు మాటలు విని గ్రామస్తులు మొత్తం అనుభవించాల్సినటువంటి క్వారీ నిధులను గ్రామాల్లోని కొంతమంది అనుభవిస్తూ వారి తప్పులని కప్పి పుచ్చుకోవటం కోసం సంఘంపై బురద చల్లడం సరికాదని, మేము చేసేది తప్పు అయితే అసలు ఆ విషయంలోనే అడుగు పెట్టమని, ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆదివాసుల పక్షం మే ఎప్పుడు ఆయన అన్నారు. సంఘంపై తప్పుడు వాక్యాలు చేస్తున్న ఆదివాసులకు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామం మొత్తం ఓనర్ గా ఉండాల్సినటువంటి క్వారీ లో వారిని కూలీలుగా మార్చి క్వారీ నిర్వహణ దారులు వారి పబ్బం గడుపుకుంటున్నారు ఈ విషయాన్ని నరసాపురం ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన హితవు పలికారు. మేము డబ్బులు డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని ఆయన సవాలు విసిరారు. నిజ నిజాలు అన్నీ కూడా త్వరలోనే కోర్టు లో తేలుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్తు జిల్లా అధ్యక్షులు తీగల బాబూరావు, డివిజన్ కోఆర్డినేటర్ పీఠ ప్రసాద్, క్వారీ వాళ్ళ నష్టపోతున్న బాధితులు పాల్గొన్నారు.